సర్వే జనా సుఖినో భవంతు

27, సెప్టెంబర్ 2014, శనివారం

గూగుల్ (Google) 16 వ జయంతి వేడుకలు


గూగుల్ ఒక సెర్చ్ ఇంజన్, గూగుల్ ఒక అమెరికన్ బహుళజాతి సంస్థ (multinational corporation).
గూగుల్ ఇంటర్నెట్ సంబంధిత సేవలు మరియు ఉత్పత్తులలో ప్రత్యేకతను సాదించింది. ఇంకా ఆన్ లైన్ ప్రకటనల టెక్నాలజీస్, శోధన, క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్ వేర్ మరియు యాడ్ వార్డ్స్
వంటి సర్వీస్ లను కలిగి ఉంది. గూగుల్ యొక్క అధిక లాభాలు చాలా వరుకు యాడ్ వార్డ్స్ నుండి పొందబడుతుంది.
గూగుల్ సంస్థను ఇద్దరు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు, లారీ పేజ్(Larry Page) మరియు సెర్జీ బ్రిన్(Sergey Brin)లు కలిసి స్ధాపించారు. ప్రస్తుతం లారీ పేజ్(Larry Page) గూగుల్ CEOగా పని చేస్తున్నారు.
గూగుల్ సంస్థ ఈ రోజు 16 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దీని గురించి హోమ్ పేజీలో ఒక డూడుల్ ఉంది.

కానీ నిజానికి ఆసక్తికరమైన అంశం ఏమిటంటే సెప్టెంబర్ 27న శోధన దిగ్గజం యొక్క పుట్టినరోజు కాదు.
నిజానికి సెప్టెంబర్ 4, 1998 సెప్టెంబర్ న గూగుల్ సంస్థ  అవతరించింది. కాని సెప్టెంబర్ 7వ తేదీ 2005(కంపెనీ విలీనం చేసినప్పుడు రోజు) వరకు దాని పుట్టినరోజుగా జరుపుకున్నారు. తర్వాతి కాలంలో గూగుల్ తన పుట్టినరోజును సెప్టెంబర్ 27వ తేదీ 2005 గా జరుపుకుంటున్నారు. ఎందుకంటే సెప్టెంబర్ 27వ తేదీ 2005న రికార్డు సంఖ్యలో గూగుల్ సెర్చ్ ఇంజన్ అత్యంత ఎక్కువ పేజీలను ఇండెక్సింగ్ చేసిన రోజు. అప్పటి నుండి గూగుల్ ఈ రోజును తన పుట్టిన రోజుగా జరుపుకుంటంది.

Related Posts Plugin for WordPress, Blogger...