కాదు కాదు నాది కీర్తి కాంక్ష
కాదు కాదు నాది కాంత కాంక్ష
అంతకన్నా కాదు కీర్తి కాంక్ష
లేదు నాకు ధన కాంక్ష
ఉన్నవి రెండే ఒకటి ఙ్ఞాన కాంక్ష
మరియొకటి మోక్ష కాంక్ష
ప్రయోజనము లేనిదే పురుగైనా
పుట్టదు
ప్రాణికోటి ఙ్ఞాన మెరిగి జీవించడమే నా
ఆకాంక్ష.
కాదు కాదు ఇది రణరంగం.
కావాలి ముందు తరాలకు కధా తరంగం.
విశాల విశ్వము యందు గల సకల ప్రాణికోటి
ముందు నేను చంటి వాడినే
పండితులు, మహనీయులు, మహాత్ముల విమర్శ వినదగిన వేళ నాకు
గర్వకారణమే.
పండితులు, మహనీయులు, మహాత్ములు, సకల ప్రాణికోటి
ఆశీర్వదించిన వేళ కలుగాలి నాకు
వాగ్దేవి కటాక్షం.
సమస్త విశ్వానికి శ్రేయోభిలాషి