ఇస్రో తలపెట్టిన మార్స్ ఆర్బిట్ మిషన్
(మామ్) విజయవంతమైన నేపద్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనంద హేళిలో మునిగిపొయారు. చరిత్రలో 24-09-2014
ఈ రోజు భారత దేశానికి మరొక సారి
సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు.
ఈ రోజు ఉదయం 7:30AM కు అంగారకుని కక్ష్యలోనికి ప్రవేశ పెట్టబడింది. ఆసియాలోనే అంగారకుని పైకి విజయవంతంగా ఉపగ్రహం పంపిన మొట్టమొదటి
దేశంగా భారత్ ఖ్యాతి గడించింది. ప్రపంచ దేశాలకు భారత్ అంటే ఏమిటో చాటి
చెప్పింది.
నవంబర్ 5 2013 న 09:08 లకు PSLV-C25 శ్రీహరి కోట యందు గల సతీష్ ధావన్
స్పేస్ సెంటర్ నుండి లాంచ్ అయ్యింది. పూర్తి వివరాల పట్టిక కొరకు చూడండి
మంగళ్ యాన్.
ఈ అంగారకుడినే మనం కుజుడు అని కూడ
అంటున్నాం. భారతీయ జ్యోతిష్య శాస్త్ర పరంగా నవ గ్రహాలలో కుజుడు ప్రముఖ పాత్ర
వహిస్తాడు. అటువంటి కుజున్ని నేడు విజ్ఞాణ శాస్త్ర పరంగా మానవుడు చేరుకోవడం
అద్బుతమైన విషయం. నిజానికి ప్రాపంచిక విషయాల గురించి అంతరిక్ష విషయాల గురించి
ఆసక్తి గల నాకైతే చెప్పలేనంత ఆనందంగా ఉంది.
భారత దేశం విజ్ఞాణ పరంగా మరింత ముదుకు
సాగి ప్రపంచ దేశాలలో అగ్ర దేశంగా నిలవాలని ఆశ్శిద్దాం.
****భారత్ మాతాకి జై****