సర్వే జనా సుఖినో భవంతు

21, సెప్టెంబర్ 2014, ఆదివారం

ఆట గదరా శివా, ఆట గద కేశవా






ఆట గదరా శివా, ఆట గద కేశవా |
ఆట గదరా శివా, ఆట గద కేశవా |
ఆట గదరా నీకు, అమ్మతోడు |
ఆట గదరా శివా ఆట గద కేశవా ||

ఆట గద జననాలు, ఆట గద మరణాలు |
మధ్యలో ప్రణయాలు, ఆట నీకు |

ఆట గద సొంతాలు ఆట గద పంతాలు ||
ఆటగద అంతాలు ఆట నీకు |

ఆట గదరా శివా, ఆట గద కేశవా |
ఆట గదరా శివా, ఆట గద కేశవా ||
ఆట గదరా నీకు, అమ్మతోడు |
ఆట గదరా శివ ఆట గద కేశవా ||

ఆట గదరా నలుపు, ఆట గదరా తెలుపు |
నలుపు తెలుపుల గెలుపు, ఆట నీకు |

ఆట గదరా మన్ను, ఆట గదరా మిన్ను ||
మిధ్యలో ఉంచి, ఆడేవు నన్ను |


ఆట గదరా శివా, ఆట గద కేశవా |
ఆట గదరా శివా, ఆట గద కేశవా |
ఆట గదరా నీకు, అమ్మతోడు |
ఆట గదరా శివా ఆట గద కేశవా ||


రచన : తనికెళ్ళ భరణి 
Related Posts Plugin for WordPress, Blogger...