సర్వే జనా సుఖినో భవంతు

10, సెప్టెంబర్ 2014, బుధవారం

గీతా సారము


మిత్రమా ! ఎందుకు బాధపడుతున్నావు ! అయిందేదో అయింది. పోయిందేదో పోయింది.

ఈ లోకానికి వచ్చేటప్పుడు వట్టి చేతులతో వచ్చావ్ ! పోయెటప్పుడు మూటాముల్లెతో పోవాలనుకుంటున్నావ్ !

అందుకే నీకీ ఆరాటం, అశాంతి. నీవేమి పోగొట్టుకున్నావని విచారిస్తున్నావు ?  

నీవేమి తెచ్చావని నీవు పొగుట్టుకుంటావు ? నీవేమి స్రుష్టించావని నీకు నష్టం వచ్చింది

నీవు ఎదైతే పొందావో అది ఇక్కడి నుండే పొందావు. ఏదైతే ఇచ్చావో అది ఇక్కడిదే ఇచ్చావు. 

ఈనాడు నీవు నీ సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం కాదా ? రేపు మరోకరి సొంతం కాగలదు.

కావున జరిగినదేదో జరిగింది. జరిగేదేదో  జరుగక మానదు. అనవసరముగా ఆందోలన పడకు.

ఆందోలన అనారోగ్యానికి మూలం. ప్రయత్నలోపం లేకుండా ప్రత్నించు. 

ఫలితం ఏదైన దైవ ప్రసాదముగా స్వీకరించు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...