సర్వే జనా సుఖినో భవంతు

18, సెప్టెంబర్ 2014, గురువారం

ఆహారము - మానవుడు


మనిషి పుట్టగానే ఆకలితో ఏడ్చును. అనగా ఆహార నిద్రా భయమైధున వాంచలలో మానవుని ప్రధమ వాంఛ ఆహారము. ధీని కొరకై మానవుడు నిరంతర కృషి చేయును. ఆకలి భాదితుడై తన ఆకలి తీర్చుకొనుటకు అనేక ధుష్క్రియలను గావించుచున్నాడు. పొట్టకూటికై చేయరాని పనులు చేయుచున్నారు, కొందరు దొంగలగుచున్నారు, ఇంకా అనేక దుష్కర్మలు చేయుచున్నారు.

కృష్ణుడి ప్రియ మిత్రుడైనటువంటి కుచేలుడు బిడ్డల ఆకలి భాదలు చూడలేక కృష్ణుని కడకేగినాడు.

మానవునికి ( ఉనికి ) ఆహారము ఆవశ్యకము. ఈ ఆకలి దప్పికల వలననే మానవుడు ఉన్నత మార్గాలను చేరుకొలేకున్నాడు. అందు వలనే సత్యాన్వేషి, నిత్యసాధకుడు, మితాహారియై యుండవలెనని భొదింపబడినది.

అధికముగా తినువానికి, అసలు తినని వానికి యోగము లేదని భగవద్గీత తెల్పుచున్నది. అధికముగా తినినను, అసలు తినకున్నను రెండూ అనారోగ్యాని కారణమవుచున్నాయని భగవద్గీత తెలుపుచున్నది.

అంతే కాక మనము తినెడి ఆహారము ధర్మబద్దమైన సంపాదన నుండి రావలెనని మరియూ ఆ సంపాదన ధర్మబద్దమైన పని నుండి రావలెనని భగవద్గీత బోదించుచున్నది.

****సర్వం శ్రీ కృష్ణార్పణం****
Related Posts Plugin for WordPress, Blogger...